తుమ్మెదోయమ్మ తుమ్మెదా
జోరు జోరున ఎగిరే తుమ్మెదా బుర్రంతా తొలిచేసావే తుమ్మెదా నీ ధర్మం పరుగయితే పరిగెత్తె నీ వేగాన్ని గమనిస్తా విహరించటం నీ హాబీ అయితే ఎరుకతో నీ సొగస్సును గమనిస్తా తుమ్మెదోయమ్మ తుమ్మెదా జోరు జోరున ఎగిరే తుమ్మెదా బుర్రంతా తొలిచేసావే తుమ్మెదా నీ పనిలో నువ్వుంటే నీ వెంటే నేనుంటా నీతో పరుగూ తియ్యను నీతో కొట్టుకూ పోను నీ సొగస్సును నీ వేగాన్నీ నీ నత్తనడకలను చూస్తూ నీ రాక పోకలను గమనిస్తూ తుమ్మెదోయమ్మ తుమ్మెదా జోరు జోరున ఎగిరే తుమ్మెదా బుర్రంతా తొలిచేసావే తుమ్మెదా ఎరుకతో గమనించి గమనించి నీ ఉనికి కోల్పోవటాన్ని వీక్షిస్తూ ఆ మౌన తరంగాలను ఆశ్వాధిస్తూ ఆనందలోకాల్లో తేలిపోతూ పరామర్శిస్తాను నన్ను నేను ఎలా ఉన్నావ్ ఎక్కడ ఉన్నావ్ అంటూ ఆలింగనం చేస్తూ ఐక్యమయిపొతా నాలోని నాతో ఈ లోకాన్నంతా మరిచి . . |
Sunday, 26 October 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment