Sunday, 26 October 2014



పుట్టిన వారు గిట్తక మానరన్నది జీవిత సత్యం
నేను పోతాను మీరు పోతారు అందరూ ఏదో ఓ నాడు పొవాల్సిన వాళ్లమే
జాతస్య మరణం దృవం అన్న సత్యం తెలిసీ
పోయిన వారి కోసం మనం పొయ్యే వరకు బాధ పడుతూనే ఉంటాం
ఉన్నప్పుడు ఓ ముద్ద పెట్టక పోయినా
చని పోయిన తర్వాత ఏమవుతమో తెలియక పొయ్యినా
ఆచారమంటు కర్మకాండలు చేస్తాం నలుగురితో నారాయణ అంటూ
శక్తికి మించి డాబు చేస్తాం అప్పు చేసయినా
అనాదిగా వచ్చే ఆచారాన్ని ప్రశ్నించే అంతటి దానిని కాదు కానీ
మనిషి పొయ్యిన వేదనలో గుండె ముక్కలయ్ రోదిస్తుంటే
మిటాయిలతో ఓదార్పు యాత్రలేమిటో
మేకలను కోసి విందు భోజనాలు చేసుకోవటం ఏమిటో
అప్పు చేసి ఊర బంతులు చేసే కన్నా
ఉన్న అర్ధనతోనో కానీతొనో ఓ మంచి పనికి శ్రీకారం చుడితే
ఆ వేదన నుండి బయట పడే అవకాశముంటుంది
వారి పేరును చిరకాలం స్మరించుకునే మంచి పనికి శ్రీకారం చుట్ట వచ్చు
ఏమంటారు ? ? ?

No comments:

Post a Comment