మన చేతి వ్రేల్ళే సమంగా లేవు; ఓ తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఒకలా ఉండరు
అని వింటూ ఉంటాము. మరి అలాంటప్పుడు ఇతరుల గురించి వారి స్వభావం గురించి
విమర్శించటం సబబేనా? తప్పు చేసే వారిని చెడు మార్గంలో నడుస్తున్న వారిని
మంచి ఉద్దేశంతో వారి అహం దెబ్బ తినకుండా సరిదిద్దాలి. అర్ధం చేసుకుని
మంచిగా మారితే మంచి చేశామన్న తృప్తి. మంచి మనస్సున్న వారు ఈ రోజులలో చాలా
అరుదుగా కనపడతారు. అలాంటి వారు చెప్పేది నీతులు వల్ళిస్తున్నట్టు చేసే ప్రతిదీ నటనగా కనపడుతున్నదంటే లోపం మనలోనే ఉన్నది . ఆ భూతద్దమ్ లో చూసే మానసిక స్థితిని అధిగమించగలిగితే ధన్యులం .
జన్మతః వచ్చే సంస్కారంతో పాటు ఉగ్గుపాలతోను , మరి ఇంట్లో పెద్ద వాళ్ళను చూసి వారు చెప్పే కధలు విని మంచి చెడు తెలుసుకునే వాళ్ళం. ఆ పైన స్కూల్లో చెప్పే పాటాలు మోరల్ క్లాస్ లు ఉండేవి. ఇప్పుడు స్వార్ధం స్వాభిమానం పెరిగి పొయ్యాయి. నేను చెప్పిందే వేదం నేను చేసేదే నాట్యంలా మారిపోయింది.
చెప్పేవాడు లోకువ అయినా మంచి చెప్పాల్సిన బాధ్యత తప్పును ఖండించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏది ఎలా చెప్పాలో ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. అయిందానికి కానిదానికి చీల్చి చెండాడితే ముందు మన మాటకు విలువ ఉండదు.

No comments:
Post a Comment