Sunday, 26 October 2014

బాధ కలిగినప్పుడు ఇతరులతో పంచుకోవటం రివాజు
అత్మీయులతో చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుందంటారు
నిజమే కానీ మాట పెదవి దాటితే కోటలు దాటి పోవచ్చు 
అలాగని గుండెల్లోని భారాన్ని మోసి మోసి 
ఆ వత్టిడితో అనారోగ్యం పాలు కావచ్చు
అలాగని మన అనుకున్న వాళ్ల దగ్గర 
మన ఈతి బాధలు చెప్పుకున్నంత మాత్రాన
మన కష్టాల కడలి నుండి బయటకు రాగలమా
మన బాధను వేదనను మరొక్కరితో చెప్పుకుని
మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనేలా
ఆలోచించండి
మీలోని మీతో చెప్పుకుని సేద తీరండి
అంతకు మించిన శ్రేయోభిలాషి కాలేరు మరెవ్వరూ
మీ భావాలకు అక్షర రూపం ఇవ్వండి
అంతకు మించిన స్వాంతన లేదు మరెక్కడా

No comments:

Post a Comment