Sunday, 26 October 2014

కలువ పూలంటే చాలా ఇష్టం
చిన్నతనంలో వేగంగా వెళ్లే కారు నుండి
కొలనులోని కలువను చూడటానికి 
పడిన ఆరాటం ఇంకా గుర్తుంది
కనుచూపు మేర చూసినా తనివి తీరని
కలువ బాలల సోయగాలు
మనస్సును ఉర్రూత.లూగిస్తుంటే
బురదలోని కమలం మనకు బోధిస్తుంది
మూలం ఏదయినా స్వచ్చంగా ఎదగమని
సౌరాభాలు వెదజల్లమని .!.

No comments:

Post a Comment