Monday, 27 October 2014

ఎరుక లేక స్పష్టత లేక ఎటు పోతున్నదీ నావ


హృదయం లోకి తొంగి చూడటం లేదు
హృదయం చెప్పేది ఆలకించటం లేదు
ఒకే ఒక క్షణం గమనం తో కన్ను మూసినా
హృదయ వాణి వినిపిస్తుంది ఇదే నీ మార్గమని
ఆ నిశబ్ధం చెప్తుంది నీ ఈ భాషను అలవర్చుకోమని
ఆ అనుభూతి అంటుంది ఇంతకు మించిన ఆనందం మరెక్కడా లేదని
ఆ మత్తు మొర పెడుతుంది ఇంతకు మించిన సౌఖ్యం మరెక్కడా లేదని
అందుకే నేను నిద్రకు తప్ప కళ్ళు వాల్చను
నా చుట్టూ జరిగే విన్యాసాలనే వీక్షిస్తా
నా చెవిలో పడే రణ గణ ధ్వనులనే వింటా
నా ఈ ప్రపంచపు వింత లనే అశ్వాదిస్తా
ఆశ పడతా కలలుకంటా ఆశయాలు ఏర్పరచుకుంటా
అవి నెరవేరేందుకు పావులు కదుపుతా
ఈ నా ప్రపంచపు మాయలో పడి
ఇదే అసలని ఇదే నిజమని ఇదే శాశ్వతమని
అనుకోక పోయినా ఇందులోనే కొట్టుకు పోతున్నా
ఎరుక లేక స్పష్టత లేక ఎటు పొతున్నదీ నావ

No comments:

Post a Comment