Monday, 27 October 2014


ఎలెక్షన్స్, కౌంటింగ్, విజయోత్సవ సందడితో గడిచి పోయింది. నా అనుభవంలో ఇన్నేళ్ళుగా జరుగుతున్నఎన్నికల విన్యాసాన్ని పునరావలోకనం చేసుకుంటే ఏమున్నది గర్వ కారణం అన్న నిరాశ నిర్లిప్తత . నోటుకు అమ్ముడు పోతున్న ఓటు~ ప్రతి ఎన్నికకు పురోగతి చెందటమే మనం సాధించిన ప్రగతి అనుకోవాలా? లేక ఎవ్వరు గెలిచినా వాళ్ళు బాగుపడటమే కానీ మనబొటి వాళ్ళకు ఒరిగే దేమిటని ఓటుకు శలవ్ ఇవ్వటం భావ్యమా? సామాన్యుడి కి రాజకీయం అందని ద్రాక్ష అయ్యినా శాసించేది ఓటరే కదా! మరి ఎందుకు ఈ విచ్చలవిడి తనం? లోపం ఎక్కడ ఉన్నది ? రాజకీయం రొచ్చు అని ఒకరంటే, రాజకీయ ఊసెత్తితేనె వెగటు పుడుతున్నదనే వారు మరొకరు.... ఎన్నికలలో నెగ్గాలంటే మందు డబ్బు ఏరులై పారాలి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన దానికి పదింతలు రాబట్టాలనేది మామూలయ్యి పోయింది. ప్రలోభాలకు లోబడి వోటును అమ్ముకోవటానికి కొందరు చదువుకున్నవారు మేధావులు కూడా సందేహీంచటం లేదు. పైగా తమను తాము సమర్ధించుకుంటున్నారు. ఎటు పొతున్నదీ దేశం అంటూ నిట్టూర్పు గీతాలు వీడక మన వంతుగా మనమేమి చెయ్యగలం ?

No comments:

Post a Comment