Sunday, 26 October 2014

కొన్ని దేవుడిచ్చిన బంధాలు
కొన్ని మనం ఏర్పర్చుకున్న సంబంధాలు
అమ్మ,నానా, అక్కా, చెల్లి అత్త - తాతా
మనం వద్దన్నా కాదన్నా కాకుండా పొయ్యేవి కావు

ఇష్టం కానీ ప్రేమ కానీ ఎప్పుడు ఎందుకు ఎలా
ఏర్పడతాయో ఆ భగవంతుడికే ఎరుక
ఒక్కసారి బీజం పడితే చచ్చేవరకు చెరగదు
సోదర ప్రేమయినా మరేదయినా

సౌలభ్యం కోసం అవసరం కోసం
ఏర్పరుచుకునే బంధాలు ఎక్కువ కాలం నిలవవు
అంతస్తుల తారతమ్యాల తులాభారంలో
తూగలేక మనలేక ఊపిరాడక కొట్టు మిట్టాల్సిందే

అందుకే స్నేహం కోసం పరుగులు పెట్టను
స్నేహవీచికల కాలుష్యాన్ని రుచి చూడలేక
మీరెలాంటి వారో మీ స్నేహితులను బట్టే
మీకు మార్కులని ఎవ్వరన్నా అంటే. . .నో వే .

వారెలాంటి వారయితే నాకెందుకు.
వారెలా ఉంటే నాకెందుకు
ప్రేమించటం నా స్వభావం
స్నేహ సౌరాభాలను వెదజల్లటం నా నైజం

ఏ బంధమూ లేక పొయ్యినా
నా దరి చేరిన వారంతా నా వారే
నా గూటిలో ఉండవు ఏ తారతమ్యాలు
ఎవ్వరయినా ఎందరయినా సేదతీరగలరు సౌకర్యంగా

ఎదుటివారిని ఎలా ట్రీట్ చేస్తానో
వారూ ఆ విధంగా ఉండాలనుకోవటం అత్యాశ
అయినా విడదీయరాని అనుబంధం ఎవ్వరితోనయినా
మారను మాయను ఎన్ని అవాంతరాలు వచ్చినా

No comments:

Post a Comment