Sunday, 26 October 2014

ఈ లోకమంతా నాదే ఈ మనుషులంతా నా వారే
అన్న భావన ఎంత మధురం
కల్లా కపటమ్ లేక మాయా మార్మం తెలియక
అందరితో అత్మీయంగా ఉండటం ఎంత మధురం
ఆర్తులకు అనాధలకు ఆపన్న హస్తం అందించి
అక్కున చేర్చుకోవటం ఎంత మధురం
బాధ పెట్టిన వారిని సైతం చిరునవ్వుతో
ఆదరించటం ఎంత మధురం

నీ పేట నా పేట నీ ఊరు నా ఊరు
నీ జిల్లా నా జిల్లా నీ రాష్ట్రం నా రాష్ట్రం
నీ బంధువులు నా బంధువులు
నీ కులం నా కులం నీ మతం నా మతం
నీ జాతి నా జాతి నీ వర్ణం నా వర్ణం
మీ పార్టీ మా పార్టీ మీ వాళ్ళు మా వాళ్ళు
ఇన్ని బేదాలు ఇన్ని వైషమ్యాలు
ఇవి వినటం ఎంత కర్ణకటోరం

No comments:

Post a Comment