Sunday, 26 October 2014

గీయంగా గీయంగా పిచ్చి గీతలు కూడా చక్కని చిత్రాలవుతాయట
పాడన్గా పాడన్గా కూనిరాగాలు కూడా చక్కని గీతాలు అవుతాయట
మరి రాయంగ రాయంగ నేనూ ఓ నాటికి కవిని కాలేనా
నా ఆలోచనా తరంగాలు ఎప్పటికి స్పష్టంగా రూపుదిద్దుకుంటాయో
నా మదిలోని బాస్వరాలు రగిలి రగిలి ఎప్పటికి నా హృదయాన్ని ఛెదిస్తాయో
నా హృదయంలో . నిబిడీకృతమయిన శక్తి ఎప్పటికీ ఉవ్వెత్తున విజృంభిస్తున్‌దో
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
నాకూ రాయాలని ఉన్నది
రాయటానికి ఏ అర్హతా అవసరం లేదు కదా
అందుకే రాస్తున్నాను
కానీ రాసిందల్లా కవిత్వమవ్వదే
రాయటానికి మంచి మనస్సు ఉండాలంట
ఆ మంచి మనస్సు నాకున్నది కదా
రాయాలంటే బాగా చదవాలి భాష మీద పట్టుండాలి
మరి అవి నాకు లేవే
మనస్సుకి తోచింది రాయటానికి చదివే వారికి అర్ధం అయితే చాలదా
నీ రాతలను చూసి గేలి చేస్తారని సంశయమా
గేలి చేసేవారిని చేసుకోమను పో నాకేంటి
నాకు నచ్చింది నేను మెచ్చింది నాకు మంచి అనిపించింది
నా తృప్తి కోసం నా సంతృప్తి కోసం రాస్తే
ఓ నాటికి సమాజం కోసం సామాజిక శ్రేయస్సు కోసం
రాసే స్థాయికి తప్పక ఎదుగుతాను

No comments:

Post a Comment