Sunday, 26 October 2014



నువ్వు నాకేమీ కావు ~ నేను నీకేమి కాను
ఏ జన్మ బంధమో ~ ఎన్ని జన్మల అనుబంధమో
అనంతమయిన ప్రేమ ~ అవ్యాజ్యమయిన అభిమానం
నువ్వు నా చెల్లివిరా అన్న నీ పలుకు ~వెయ్యేనుగుల బలం ఇవ్వగా
పదిలంగా గుండె గదుల్లో దాచుకున్నాను ~ పిచ్చి అభిమానంతో
ఎప్పుడు ఎలా ఎందుకు ఏర్పడిందో ~ ఆ మమకారం
కలవకపోయినా ~మాట్లాడకపోయినా ~ కన్నెత్తి చూడక పోయినా
నువ్వున్నావన్నధైర్యం ~ నువ్వే చూసుకుంటావన్న స్థైర్యం
నువ్వు ఈ విశ్వానికే రాజువు ~ నేను గూటిలో చిలకమ్మను
నీకు ఎందరో వందిమాగధులు ~ మరెందరో అత్మీయులు ~ క్షణం తీరిక లేని జీవితం
నాది చిన్న ప్రపంచం ~ మద్యతరగతి మనస్తత్వం
ఓసారి అభిమానం అంటూ ఏర్పడితే ~ పుడకలతో పొవాల్సిందే
నీ మహా విశ్వంలో ~ నేను అణువును మాత్రమే
నీకు యాద్ ఉంటానో ~ లేదో కూడా తెలియదు
నన్ను అభిమానించేవారి వలన ~ నొప్పి కలిగితే
కన్నీళ్లతో ~ కబీర్ దోహెను మననం చేసుకుంటాను
"నాకు నొప్పి కలిగితే ~ రామా అంటూ నీకు మొర పెట్టుకుంటాను
అది రామబాణం అయితే ~ నేనెవ్వరితో చెప్పుకోను రామా" అని
నీవు నాకు అన్నగా ~ అనురాగాన్ని పంచినందుకు
నీ కోసం ~ ఎన్ని అవమానాలు భరించానో
ఎన్ని సార్లు ~ నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టానో
ఆ భగవంతుడికే ఎరుక
ఆవలి ఒడ్డున ఉన్నా ~ తాబేలు తన పిల్లలకు ప్రేమను అందించినట్టు
ఈ చెల్లెలి ప్రేమ ~ నీకు శ్రిరామరక్ష
ఏదీ ఏమయినా ~ మరో జన్మంటూ ఉంటే
నీకు ఒక్కగా నొక్క చెల్లెల్లిగా ~ పుట్టాలని కలలు కంటూ . .

No comments:

Post a Comment