Sunday, 26 October 2014

ఎటు పొతున్నదీ నావ
ఎటు సాగుతున్నదీ పయనం
గమ్యమేమిటో తెలియక
దారేమీ కానరాక
అగమ్యగోచరంగా సాగుతుంటే
అటు పొయ్యి ఇటు పొయ్యి
తిరిగి తిరిగి తిరిగి
మొదలయిన చోటికే వచ్చినా
నిర్లిప్టాంగా నిర్వీర్యంగా నిర్జీవంగా కాక
గమ్యం ఏమిటో దారి ఎటో
తెలుసుకుంటానన్న నమ్మకంతో
తప్పక గమ్యం చేరుకుంటానన్న ఆశతో
కాలాన్ని వృద్దా చెయ్యక
నా ప్రయత్నం నేను చేశానన్న తృప్తి
గొప్ప సంతృప్తి నివ్వగా
పట్టు వీడక అస్త్రం వదలక
రోజు రోజుకీ నూతనోత్సాహంతో
నిన్నటి జ్ఞాపకాల సంతృప్తితో
రేపటి కమ్మని కలలతొ
ఈ రోజుకి న్యాయం చేశానన్న ఆనందంతో
సాగుతూనే ఉంటా సాగిపోతూనే ఉంటా
ఎప్పటికయినా గమ్యం చేరతానన్న విశ్వాసంతో. . .

No comments:

Post a Comment