Sunday, 26 October 2014


ఏమయినా చెయ్యగలనన్న అపారమయిన నమ్మకం
ఏదయినా సాధించగలనన్న అపారమయిన విశ్వాసం
ఇంతలోనే తగిలిన ఎదురు దెబ్బలకు నిరాశ నిస్పృహ
మరంతలోనే అంతరాంతరాల నుండి ఎగిసె ఉజ్వల జ్వాల
అణువణువులోని కసి ఉవ్వెత్తున లేచే ఆశయాల ప్రజ్వల
ఏ కారణం లేకుండా ఇక్కడకు ఎందుకు వచ్చానన్న ఆలోచన
ఏ ప్రయోజనం లేకుండా ఎందుకు జీవిస్తున్నానన్న ఆవేదన
ఏ ప్రణాళిక లేకుండా వేస్తున్న అడుగులు
ఎంతవరకు సాగుతాయో తెలియని అయోమయం
ఏ దారీ లేని కొండను డ్డీ కొడుతూ
ఏటికి ఎదురీదుతూ అలసి సొలసినా
ఎప్పటికి ఆ దరి చేరతానో
తెలియకపోయినా ఈదుతూనే ఉంటాను
లేకపోతే పిచ్చిదాన్నయి పోతానన్న భయం కాదు
నా కోసం నా స్వాభిమానం కోసం
నా తృప్తి కోసం నా సంతృప్తి కోసం

No comments:

Post a Comment