Sunday, 26 October 2014

చిట్టి పాపాయి అమ్మ నాన్నలను అలరిస్తుంది
బుడి బుడిరాగాలతో కేరింతలు కొట్టిస్తుంది
బోర్లా పడి సంబరపరుస్తుంది
ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తుంది
తనను తాను నిరూపించుకోవాలనీ కాదు
ఇతరుల ముందు ప్రదర్శించాలనీ కాదు
ఆది తన సహజ లక్షణం

పెరుగుతున్న కొద్ది
అక్కతో పోటీ తమ్ముడితో పోటీ తోటి వారందరితో పోటీ
పోటీలో నెగ్గాలన్న ధాటి
జీవనవనంలో చిగురించే ఆశలు ఆశయాలు కమ్మని కలలు
ఆశలను ఆశయాలను సాధించాలన్న ఆవేదన
కన్న కలలను నిజం చేసుకోవాలన్న తపన
డబ్బో గుర్తింపో కీర్తిప్రతిష్టలో సాధించాలన్న ధ్యేయం

ఈ పరుగు పందెంలో
రేపటి గురించిన ఆలోచనలతో
తనను తాను మరిచి
తన ఉనికిని కోల్పోయి
ఏది నిత్యం ఏది అనిత్యం అన్న స్పృహ లేక
కోల్పోతున్నాం మనను మనం అలసి సొలసి
పొస్ట్‌పోన్ చేస్తున్నాం ఆనందాన్ని ఈ క్షణాన్ని మరిచి

ఏది చేసినా ఏది నేర్చినా నీ పాండిత్యం ఎంతయినా
అది ఇతరులను అలరించటానికేనని మరువకే
నువ్వు ఆనందంగా ఉంటూ నీ పరిసరాలను ఆనందంగా ఉంచుతూ
నీ ఆత్మ ప్రబోధంతో విచక్షణతో అడుగులు వేస్తూ
నిన్ను నీవు ఆత్మపరిశీలన చేసుకుంటూ
నిన్నటి తృప్తితో
ఈ క్షణాన్ని అశ్వాధిస్తూ సాగిపో

No comments:

Post a Comment