దురపు కొండలు నునుపంట
ఆలకించేది ఎవరంట
పట్నంలో బడి అంటే మోజంట
పల్లె పలుకులు మోరటంట
పొట్ట కూటికి నగరానికి పోవాలంట
ఊర్లో కూలికి వెళ్ళటం చులకనంట
స్వదేశీ వరుడు ఒద్దంటా
విదేశీ వరుడికి డిమ్యాండ్ అంట
ఫారిన్ లో సాఫ్టువేరుద్యోగం ముద్దంట
సొంతూరులో వ్యవసాయం చేదంట
మారాలీ మారాలి మన వైఖరి మారాలి
నింగి నుండి నేలకు చూపు మారాలి
మారాలి మారాలి మన యోచన మారాలి
తరాల అంతరాలను గమనించాలి
మారాలి మారాలి యీ సమాజం మారాలి.
No comments:
Post a Comment