Tuesday, 18 June 2013

నేను నేనుగానే వుంటాను

అమ్మ మిలటరీ డిసిప్లిన్తో నాలో వినయం వినమ్రత ఒధిక ఏర్పడితే
 తాతయ్య పెంపకంలో ఆత్మవిశ్వాసం నమ్మిన దానికి కట్టుబడి వుండటం అలవడ్డాయి 
అమ్మంటే భయంతో మూగి నై  అందరు వున్నా ఒంటరినయితే 
తాతయ్య ప్రేమ  ఇచిన భరోసా మాటలకి చేతలకి కాక రాతాలకే పరిమితమయ్యాయి 
నా కుటుంబమే నేర్పిందో లేక నా స్వభావమో; అందరిని ప్రేమించటం నా తత్వం 
మనసార పలకరించటం, తెలియనివారయినా ఓ నవ్వేయటం నా నైజం 
ఆ నైజమే ఎక్కడికి వెళ్ళినా ఎందరినో తోడూ చేస్తుంది 
నేనెవ్వరిని ఏమీ అనను; నన్ను అన్నా తిరిగి అనలేను బాధ పడటం తప్ప 
ఏదయినా నచితే నచిందని చెప్పటం; నచ్చకపోతే మౌనంగా వుండటం 
వున్నది వున్నట్టు ఒధికగా మాట్లాడటం తప్ప పొగడటం అస్సలే రాదు 
నా ఇంటికి వచినవారు మంత్రయినా పరిచారికయినా ఒకే ఆతిధ్యం 
అలాగని నన్ను గాయపరిచిన వారిని  నన్ను అకారణంగా ద్వేషించేవారిని 
నవ్వుతూ పలకరించాలంటే కొంత సమయం కావాలి 
వారిని కుడా ప్రేమించాలంటే ఇంకొంచం సాధన కావాలి 
ఏ గుణాలను అందరు శభాష్ అన్నారో వాటినీ వేలెత్తి చూపితే 
పై పై నవ్వులతో హత్తుకోవడం; ప్రేమ వోలకపోయ్యడం 
మర్మగర్భంగా మాట్లాడటం నాకు చేతకాదు 
లౌక్యం తెలియదన్నా బ్రతకటం చేతకాదన్నా నేనింతే 
లౌక్యం తెలిసినా  మదిలో మరేదో ఉంచుకుని
 పైకి మరోలా వుండి నన్ను నేను మోసం చేసుకోలేక 
నేను నేనుగానే ఉంటానంటే; ససేమిరా అనే ఈ లోకంతో 
ఇమడలేక బ్రతుకును వెళ్ళదీయలేక క్రుంగి కృశించి 
మరంతలోనే రెట్టింపు వేగంతో ఉవ్వేతున లేచి 
నేను నేనుగానే వుంటాను ఎవరికోసమో బ్రతకలేను 
నాకోసం నా ఆనందం కోసం నా కుటుంబం కోసం 
నా వసుధయిక కుటుంబం కోసం 
పది మందికి అండగా, నేనున్న్నాను మీకు అంటూ 
శక్తీనయ్ ప్రచండశక్తినయ్ నిలుస్తాను 
అన్నిటిని త్రోసి రాజాని  

1 comment:

  1. This was published in Vanita Jyothi 18 yrs back wt a lil variation and yesterday it was republished in Seva patrika.

    ReplyDelete