నిత్యం అనునిత్యం ఒకటే గ్గోష
ఏదయినా చెయ్యాలని ఎలాగయినా సాధించాలని
నన్ను నేను మార్చుకోవాలని
మనసున్న మనిషిగా మనీషిగా ఎదగాలని
ప్రతి రేయి ప్రతి పగలు నిలేస్తున్నది నన్ను
నిన్నేమి సాధించావని నేడేల గడుపుతవని
మనిషిని మనిషిగా గౌరవించాలని
ప్రతి ఒక్కరిని ప్రేమించాలని
మంచీ మానవత్వం పెంచుకోవాలని
నిత్యం అనునిత్యం ఒకటే సంగర్షణ
ఈ తపన ఈ తాపత్రయం దేనికని
ఈ సంగ్గర్శ్హన ఎందుకని
నువ్వు నువ్వుగా సాటి మనిషికి బాసటగా
ఎరుకతో జీవించు
నిన్ను నీవు కోల్పోకుండా
నీ వున్నతమయిన భావాలూ ఆ దృడసంకల్పం
తప్పక చేస్తాయి నీ కలను సాకారం
No comments:
Post a Comment