Sunday 26 October 2014

బాధ లేని జీవి ఉండదేమో ఈ సృష్టిలో
ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు
ఎవ్వరి బాధ వారిది
నాకు బాధ అనిపించింది ఇతరులకు సిల్లీ గా అనిపించవచ్చు
అందుకే "Put Urself in my shoes" అంటారు
ఎప్పుడు కూడా ఎవ్వరినీ జడ్జ్మెంటల్ గా చూడకండి
నీకు న్యాయం ధర్మం అన్నది వారికి అవ్వొచ్చు కాకపోవచ్చు
ఇతరులు ఏంటి అని కాక నిన్ను నీవు ప్రశ్నించుకో
నీకు నీవే జవాబుదారివి కాని మరెవ్వరికో కాదని గుర్తించు
ఇతరులలో లోపాలను ఎన్నే ముందు నీ లోపాలను సరి చేసుకో
మంచి మాట్లాడటానికీ మంచి చెయ్యటనికీ మంచి చెప్పటానికీ ఏ నియమాలూ లేవు
కొందరికి పాడాలని అనిపిస్తే మరి కొందరికి నాట్యం చెయ్యాలనిపించవచ్చు
కొందరికి చెప్పాలానిపించవచ్చు మరికొందరికి చెయ్యాలానిపించవచ్చు
కొందరికి రాయాలనిపించవచ్చు మరి కొందరికి గుర్రు పెట్టి నిద్ర పోవాలనిపించవచ్చు
ఎవ్వరికి ఇష్టమయినట్టు వారుంటారు అడగటానికి మనమెవ్వరం
ఎవ్వరినీ ఇబ్బంది పెట్టనంత వరకు ఎవ్వరి ఇష్టం వారిది
అడిగే హక్కు ఎవ్వరికీ లేదు
ఏమంటారు

No comments:

Post a Comment