Sunday 26 October 2014

మరణం:
పిరికివాడు క్షణం క్షణం మరణిస్తే
ధైర్యవంతుడు ఒక్కసారే మరణిస్తాడన్నది ఆర్యోక్తి
మనం ఏ తప్పు చెయ్యనప్పుడు ఎందుకు భయపడాలి
మన నైతికతే మన ధైర్యం కావాలి
మన నిజాయితీనే మనకు అండ అవ్వాలి
పుట్టిన ప్రతి జీవీ గిట్తక మానడు
ఏదో ఓ రోజు మరణం సంభవిస్తదని
నిత్యం చస్తూ బ్రతికీతే ఎలా
మరణాన్నే చ్యాలెంజ్ చేస్తే పోలా
ఈ క్షణమయినా ఏ క్షణమయినా
నేను చావుకి సంసిద్డమంటూ.
చావు బ్రతుకులకు ఏమున్నది వ్యత్యాసము
ఓ సన్నటి పొర
జీవంతో ఉండటం లేకపోవటం
ఊపిరి ఉండటం ఆగిపోవటం
థట్స్ ఆల్
తొలిశ్వాసతో భూమి మీద పడి
తుది శ్వాసతో లోకాన్నే విడిచి
వస్తూ ఏమీ తెచ్చాం పోతూ ఏమీ పట్టుకు పోతాం
మరెందుకీ ఆరాటం ఆవేదన ఆందోళన
బ్రతికినన్నాళ్ళు హాయిగా బ్రతక్క

No comments:

Post a Comment