Sunday 26 October 2014

భయం భయం భయం
జీవితమంతా భయం
ఇంట్లో అమ్మ అంటే భయం 
స్కూల్లో టీచర్ అంటే భయం
చీకటి అంటే భయం బూచి అంటే భయం
దొంగలంటే భయం దోపిడీలంటే భయం
హాస్పటల్లో డాక్టర్ అంటే భయం
జ్వరం వస్తే ఇంజెక్షన్ అంటే భయం
దీపావళికి కాల్చే బాంబులంటే భయం
రోడ్ సైడ్ రోమీయో లంటే భయం
పెళ్లయితే మొగుడు అంటే భయం
అత్తింటి వాళ్ళంతే భయం
ఆ పై అల్లుడంటే భయం
అతని కుటుంబ మంటే భయం
ఇక రెక్కలోచిన కొడుకంటే భయం
నడమంతరపు కోడలు అంటే భయం

భయం భయం భయం
జీవితమంతా భయం
భయంతోనే జీవితమంతా
క్రుంగీ కృశించి
నిర్లిప్తమ్గా నిరాసక్తిగా
బ్రతకాలి కాబట్టి
ఆయుషు ఉంది కాబట్టి
రోజులు వెల్లదీయాటమా
పుట్టింది మొదలు గిట్తే వరకు
ఏ తప్పు చెయ్యకుండానే
భయపడి భయపడి
నిత్యం మరణ శోకంతో
ప్రతి క్షణం చస్తు బ్రతికే కంటే
ఒకే ఒకసారి తల ఎత్తి ప్రశ్నించు
తల ఎత్తుకుని బ్రతకటంలోని మజాను ఆస్వాదించు.!.

No comments:

Post a Comment