Sunday 26 October 2014

నీకో న్యాయం నాకో న్యాయం
ఇదెక్కడి న్యాయం
నీకు మంచి నాకు చెడు అయినా
నాకు మంచి నీకు మంచి 
కావాలని తలపొస్తా
ఎన్ని నీలి మేఘాలు కమ్మినా
ఎన్ని సుడిగుండాలలో చిక్కుకున్నా
అన్నీ భరిస్తూ మౌునాన్నే ఆశ్రయించా
నీకో న్యాయం నాకో న్యాయం
ఇదెక్కడి న్యాయం
అని ప్రశ్నించేందుకు నిలదీసేందుకు
ఆ వివేచన ఉంటే కదా
నా తల్లి ధరిత్రి ఇచ్చిన ఓర్పు సహనం
నాలో చెలరేగే అగ్నిశిఖలను
మలయ మారుతంలా చల్లబరుస్తుంటే
నాలోని సంఘర్షణ నాలోనే కప్పుంచి
ఉదాసీనంగా కదిలిపోయ్యే జీవనయానానికి
నేనే వైద్యుడిని నేనే సంస్కర్తని

No comments:

Post a Comment