Sunday 26 October 2014


జీవితం . . .
ఓ మధుర స్వప్నం కొందరికి
ఓ జగన్నాటకం మరి కొందరికి
జీవితం . . .
పూలపాన్పు కొందరికి ముళ్ళపాన్పు మరి కొందరికి
అయినా ఎరుక లేక గమనం లేక మాయలో కొట్టుకుపోతున్న ఓ మనిషీ
నిన్ను నీవు మరిచి నీ దారి మరిచి నీ లక్ష్యాన్ని మరిచి
ఎటు పోతున్నావు నీ ఉనికిని మరిచి
ప్రశాంతంగా కూర్చో ఓ క్షణమయినా నీ పరుగు ఆపి
నీలోని ఆర్తిని వింటావు
నీ ఆత్మఘోషని తెలుసుకుంటావు

అభం శుభం తెలియని బాల్యం
కనిపించేదంతా యదార్ధమనిపించే కౌమారం
నాకే అన్నీ తెలుసు అనుకునే యవ్వనం
అనుభవ పాటాలతో తల పండిన వృద్దాప్యమ్
బాల్యం కౌమారం యవ్వనం వృద్దాప్యమ్
అన్ని దశలలోనూ నిర్లక్ష్యం చేశావు కదరా నీ లోని శక్తిని
గర్బస్థదశలో మొదలవ్వాల్సిన పయనం
విఘ్నేశ్వరుని పెళ్లి రేపు
అన్న చందాన పొస్ట్‌పోన్ చేసుకుంటూ
ఓ నాటికి ఈ లోకాన్నే వదిలితే
ఈ జన్మ వ్యర్ధమే కదా

లే, మేలుకో, నీ అంతర్వానిని విను
నీలోని నిన్ను దర్శించుకో
నిన్ను నీవు తెలుసుకో
అధ్యాత్మిక భౌతిక జీవనాలను సమన్వయం చేసుకో
ఆ జీవితం ఆ నిశబ్ధం
ఎంత సుందరంగా ఉంటుందో
ఎంత సూక్ష్మంగా ఉంటుందో
అస్సలయిన మాధుర్యం ఏమిటో
చెప్పటానికి మనస్సు పలకదు
మాట పెగలదు పెదవి కదలదు
ఈ హృదయం నుండి ఆ హృదయానికి మాత్రమే. .

No comments:

Post a Comment