Sunday 26 October 2014

రామాయణం అయినా
భారతం అయినా
కొత్త కధ కానీ 
పాత కధ కానీ
ఊహల పల్లవి అయినా 
యదార్ధ గాధ అయినా
ఎవ్వరికుండదు ఆసక్తి
మనలో ఎన్ని లోటు పాట్లు ఉన్నా
మన జీవితంలో ఎన్ని అపస్వరాలు ఉన్నా
ఇతరుల జీవితాలలోకి తొంగి చూడటం మహా సరదా
ఉన్నవి లేనివి కధలు కధలుగా
చెప్పుకోవటం అంటే మహా సంబరం.
ఆయుషు లేక చిన్న వయస్సులో కాలం చేస్తే
అయ్యో అంటూనే గుస గుసలు
తనని తాను మరిచి లోకం కోసం బ్రతికే వారిని సైతం
మనీ మైండెడ్ గా ప్రచారం చెయ్యగల లోకం
మనిషిని మనిషిగా కాక
వేషభాషలను
అంతస్తులను బేరీజు వేసే శకం
మంచిని మంచిగా చూడలేని ఈ పాడు లోకం
వద్దు వద్దే వద్దు అనేవారే
మార్పు రావాలి సమాజం మారాలి
అని గొంతెత్తి అరిచేవారే
ఆ మార్పుకు మనమే నాంది ఎందుకు కాకూడదు?

No comments:

Post a Comment