Sunday 26 October 2014


వలస వలస వలస వలస వలస వలస వలస వలస వలస వలస వలస వలస వలస

పొట్ట చేత పట్టుకుని పొట్ట కూటికి వలస పొయ్యే

వరద విరుచుకు పడిందని కట్టు బట్టలతో వలస పొయ్యే

ఇల్లు వాకిళ్ళు తగలబడ్దాయని తల దాచుకోను వలస పొయ్యే

కరువు కాటకాలు వచాయని బ్రతుకు తెరువుకై వలస పొయ్యే

తినటానికి పంచబక్ష్యపరమానాలు ఉండీ

ఉండటానికి లంకంత కొంప ఉండీ

అన్నీ ఉండీ అందరు ఉండీ

జననిని జన్మభూమినీ వదిలి

ఇంత వాడిని చేసిన దేశాన్ని మరిచి

యూనివర్సిటీ ఇచ్చిన పట్టా చేత పట్టుకుని

దేశం కానీ దేశంలో అడుగు పెట్టి

డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ శ్రమైక సౌందర్యాన్ని ఆరాధిస్తూ

కమ్మటి భోజనానికి దూరమయ్

కొసరి కొసరి వడ్డించే అమ్మకు దూరమయ్

మమతల కోవెలలో వెచ్చగా సేద తీరే సుఖానికి దూరమయ్

సంపాదనకై పరుగులు పెడుతూ

అలిసి సొలిసి వేసారి

పని వత్తిడితో మానసిక వత్తిడికి గురయ్

వేళ తప్పి కమ్మటి నిద్రకు దూరమయ్

సహజత్వానికి దూరంగా కృత్రిమంగా బ్రతుకుతూ

ప్రపంచం చాలా చిన్నది అనుకుంటూఎటు పోతున్నాం .

మాతృప్రేమంటాం మాతృభూమంటాం విశ్వప్రేమంటాం

వన్-వర్ల్డ్ ఫ్యామిలీ అంటూ వసుధైక కుటుంబమంటాం

బ్రేన్ డ్రేన్ అంటూనే యూనివర్సలైసేషన్ గ్లోబలైసేషన్ అంటాం

గిరి గీసుకుంటూనే విశాలత్వం గురించి ఆలోచన చేస్తున్నాం

ఈ ద్వంద్వం ఏల?

No comments:

Post a Comment