శరీరం చలినీ భరించలేదు
అలాగని వేడినీ భరించలేదు
మనస్సు మమతను తప్ప
ధిక్కారాన్ని భరించలేదు
చెవులు తేనెలురే పలుకులే కానీ
కఠినమయినవి వినలేనంటున్నాయి
ప్రేమ వర్షించే చల్లని చూపే కానీ
ఛీత్కరించే చూపు ససేమిరా అంటున్నధి
ఏమిటీ మాయా ఏమిటీ విపరీతాం
ఏమిటి యీ నా తత్వం
వసంతం ఎప్పుడూ ఎలా సాధ్యం
వసంతం ఎప్పుడూ ఎలా సాధ్యం
యీ జీవన పోరాటంలో తప్పవని తెలిసినా
అంగీకరించలేకపోతున్నాను
రోధించే నేత్రాలు సోకించే హృదయం
అలసి సొలసి పొయ్యాయి మనస్శరీరాలు
యెన్నాళ్ళు యెన్నేళ్ళు యీ వ్యధలు
అన్నీ చుట్టిపెట్టి అటకెక్కిచలేనా
ఎవ్వరెమంటే నాకేంటి
ఎవ్వరెలగుంటే నాకేంటి
నేను నేనుగనే ఉంటా
నా ఉనికిని కాపాడుకుంటా
ఏధి ఏమయినా
ఏధి ఏమయినా
ప్రపంచం తలకీందులయిన
అంధరు యుధం ప్రకటించినా
వధలను వధలను నా లక్ష్యాన్ని
చెదరనివ్వను నా చిరునవ్వుని.
చెదరనివ్వను నా చిరునవ్వుని.
No comments:
Post a Comment