Thursday, 30 May 2013

Kaakula madhya kokilamma

ఒంటరిగా ఉన్నావేమమ్మ
నీ మనస్సుకు నచ్చిన వారే లేరా
నచ్చినవారే లేరంటే ఎలాగ
ఈ లోకంలో ఎలా బ్రతుకుతావమ్మా
పిచ్చి తల్లీ, ఎవ్వరూ చెడ్డవాళ్ళు కారమ్మా
లోపం లేని మనిషే లేరమ్మా
మరి నీలో ఏ లోపం లేదా
మనం సంఘజీవులమమ్మా
దేవునిలోనే లోపాలు ఎంచే చిన్ని మనసమ్మా
విప్పారిన హృదయంతో వీక్షించ
నీ పెద్ద మనస్సుతో అంగీకరించ
యధాతధంగా స్వీకరించ
అన్ని పరిస్థితులను అందరు మనుషులను


No comments:

Post a Comment