ముత్యాలు మూటకట్టే ముసిముసి నవ్వు
ముచ్చట గొలిపే ముత్యాల నవ్వు
నవ్వు నవ్వు నవరత్నాల నవ్వు
చెదరనివ్వకు నీ మోముపై ఎల్లవేళలా ఆ వరాల నవ్వు
కష్టాలొచ్చినా కన్నీరోచ్చినా పరిష్టితులు తారుమారయినా
పండించు సిరిసిరి నవ్వు నీ మోముపై చైతన్యంతో
విరగాపుయ్యాలి బంగారునవ్వు హ్రుదయాన్తరాలనుండి
సాదించలేనిదంటూ ఏమీ లేదు చిరునవ్వుతో
నీ నవ్వు వర్షించాలి ప్రేమామృతాన్ని విశ్వమంతా ఏకంచేస్థూ
No comments:
Post a Comment