Saturday, 25 May 2013

ఈ సమాజంలో ఆడవాళ్ళకు రక్షణ లేదా ?

 
 
ఈ సమాజంలో ఆడవాళ్ళకు రక్షణ లేదా
ఎటు పోతున్నది ఈ ప్రపంచం
శ్రీ శ్రీ కలలు కన్న ఆ మరో ప్రపంచం ఏది
బాపూజీ కల లు కన్న రామరాజ్యం ఇదేనా
వీరేశలింగం ఆశించిన సమసమాజమేనా ఇది
ఎటు పోతున్నది ఎటు పోతున్నది ఈ వెర్రి ప్రపంచం
ఓ కాకి చస్తే వంద కాకులు వచినట్టు
చేతులు కాలాకా ఏడ్చి లాభమేంటి
తరాలు గడుస్తున్నాయ్ యుగాలు గడచినా
ఇదే మనుషులు ఇదే ప్రపంచం
... ఇలాగె వదిలేదామా
పోతే పోనీ పోతే పోనీ
ఈ ప్రపంచం ఎమయిపోతే నా కేంటి
నేను నా కుటుంబం బాగుంటే చాలు అంటావా
లే నిద్రలే మతువదిలి కళ్ళు తెరిచి చూడు
ఆడ బిడ్డల ఆర్తనాదాలు\
మరో ఆడ పిల్ల బలవ్వక ముందే
మేల్కొ కొదమ సింహం వలే విరుచుకుపడు
సృష్టించు మరో ప్రపంచాన్ని మరో రామరాజ్యాన్ని
పూనుకో నవసమాజ నిర్మాణానికి

2 comments:

  1. శుభాకాంక్షలు,ఇది నేను మీ నుండి ఎదురుచూచేది.

    ReplyDelete
    Replies
    1. హృదయ పూర్వక ధన్యవాదాలండి రామ్ గారు !

      Delete