Friday 14 June 2013

ఇదేనా స్త్రీని దేవతగా పూజించే భరతభూమి


మా వూరు వూరు ఓ అమ్మ కోసం గగ్గోలెడుతుంటే
మేము అందాలు అలంకరణలతో సంబరాలు జరుపుకునామ్
కొందఱు జులాయిలు యమకింకరులై ఓ అమ్మను బలికొంటే
మేము ప్రపంచాన్ని మరచి అలంకరణల పోటీలు జరుపుకున్నాం
కూతురిని అల్లరి పెడుతున్న ఆటకాయిలను ప్రతిఘటించిన అమ్మ
నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా లారి కిందకు నేట్టివేయ్యబడిందన్న
వార్త చెవిన పడినా స్వీకరించాలేనంతగా\ తలమునకలయ్య్యానని
తలచుకుంటే నా మీద నాకే జుగుప్స కలుగుతున్నది
ఇదే మన సొంతవారికి జరిగితే అలా స్తబ్దంగా ఉండగలమా
మా అమ్మమ్మ పలుకులు స్మరనలోకి వచాయి
అమ్మకి బాధ కలిగితే ఏడుస్థూ అందరికి అన్నీ అమర్చి కదుల్తున్ధి
అదే కూతురికి బాధ కలిగితే ఎక్కడివక్కడ పడేసి వాలిపోతది తల్లి.
మా ఊరిలో జరిగిన సంఘటనకు పక్క రాష్ట్రాలనుండి స్పందిస్తుంటే
నేను ఓ రోజు గడచిన తర్వాత మొరిగినట్టుగా ఉన్నదేమో కాని
స్పందించకుండా ఉండలేకపోతున్నాను
ఆ కుర్రాళ్ళు క్షనికావేసానికి లోను కాకుంటే ఆ నిండు ప్రాణం బలయ్యేదా
ఒకే ఒక క్షణం ఆ మనోవికారాన్ని ఆపుకుంటే
ఈ దుర్ఘటన జరిగెదా?
ఈ లోకంలో చెడ్డ వారన్తూ యెవ్వరూ లేరు
చిన్న చిన్న లోపాలే ఇంతటి కిరాతకానికి దారితీస్తాయి
అమ్మల్లారా అక్కల్లారా చెల్లెల్లారా దేశానికి మీరేమి చెయ్యనక్కర్లేదు
దేశానికి ఉతమ పౌరుల్ని అందించకపోతే పో
కనీస సభ్యతా సంస్కారాలన్న అలవర్చు తల్లీ...
ఇదేనా స్త్రీని దేవతగా పూజించే భరతభూమి
అని ఎదేవా చెయ్యనివ్వకు నా బంగారు తల్లి

No comments:

Post a Comment