Thursday 30 May 2013

తల్లడిల్ల కుండా ఎలా వుంటాం


అంగీకరించటం అంగీకరించకపోవటానికి చిన్న వ్యత్యాసమే
మాటలు చెప్పటం వేరు రాతలు రాయటం వేరు
నమ్మిన సిధాంతాన్ని ఆచరించటం వేరు
ఆచరణకు ఎంతో స్థైర్యం కావాలి
మనకనుకులంగా వుంటే మనకు మేలు జరిగితే
సంతోషంతో వుప్పొంగిపోతాం ఎన్నెన్నో ఊసులాడ తాం
మధురభాషణలకు ఆనంద వీచికలకు స్వాగతం పలుకుతాం
కష్టసుఖాలకు సుఖదుఖాలకు జయాపజయాలకు
సమంగా చూడటమే నిజమయిన సాధన అంటాం
యోగాలు చేస్తాం ధ్యానాలు చేస్తాం
వ్యక్తిత్వ వికాస కోర్సులంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తాం
దెబ్బ తగిలితే విలవిల్లాడతాం కష్టం వస్తే కన్నీరు కారుస్తాం
ఆత్మీయులు దూరమయితే తల్లడిల్ల కుండా ఎలా వుంటాం

No comments:

Post a Comment