Sunday, 13 October 2013

దిగులు పడకే అమ్మా బావురు మనబోకే తల్లీ ఓ నా తెలుగు తల్లీ

దిగులు పడకే అమ్మా బావురు మనబోకే తల్లీ ఓ నా తెలుగు తల్లీ
నాటకాలాడి రక్తి కట్టించే నీ బిడ్దలను చూసి గుండె దిటవు చేసుకో తల్లీ
ఏ అరమరికలు లేకుండా ఏ గిల్లీకజ్జాలు
లేకుండా ఒకటిగా ఉన్న నీ బిడ్దలను
విడగొట్టి వినోదం చూసే శకునిలను చూసి బాధపడకే అమ్మ
కలసి ఉంటే కలదు సుఖమన్నావు
విడిపోతే వినాశనమని తల్లడిళ్లకే అమ్మా
కాదు కూడదంటే మనకే మంచిలే ఏమీ జరిగినా మన మంచీకేలె
నీ ప్రేమకు ఎల్లలు లేవు నీ హృదయానికి గోడలు లేవు
విశ్వమంతా నీ బిడ్డలే తల్లీ ఓ నా తెలుగు తల్లీ
విశ్వమంతా వ్యాపింఛు విశ్వ ప్రేమనందించు
సగర్వంగా విశ్వ భూమిక పై ఎగరవేయ్యి నీ పతాకాన్ని
వస్తాయిలే మంచి రోజులు తప్పక వస్టయిలే మా మంచి రోజులు

No comments:

Post a Comment