Sunday, 13 October 2013

ఇదీ నా ప్రపంచామనీ సగర్వంగా

ఏముంది ? ఏముంది? ఏముంది ? యీ ప్రపంచానికి గర్వకరం 
అబ్బుర పరుస్తున్నాయా ?ప్రపంచపు వింతలూ విడ్డురాలు
ఆకలి చావులు అవినీతి నేతలు అనాధాల ఆర్తనాదాలు
గుండెను మెలి పెడుతుంటే మనస్సును కలిచి వేస్తుంటే 
యీ దుష్ట దుర్ణీతి జగతిలో జగమేల జాగృతమయ్యే
నయవన్చకుల కల్లిబోల్లి కబుర్లకు బలవ్వనేల
ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడక 
మత్తు వదిలి మైకం వదిలి మేలుకో
కదులు ఒక్కో అడుగు మున్ముందుకు కదిలించు ఒక్కొక్కరినీ
చైతన్య పరుస్తూ చైతన్య పధంలో
ఓ నాటికీ తప్పక సాధించేవు నీ స్వప్న జగతిని
ఇదీ నా ప్రపంచామనీ సగర్వంగా..

No comments:

Post a Comment