Monday, 27 October 2014


Greenshop Vijayawada's photo.
Greenshop Vijayawada's photo.
Greenshop Vijayawada's photo.
HOME MADE COUGH SYRUP:

Ingredients:
1. betel leaf juice - 1cup.
2 ginger juice -1cup.
3. misri / sugar -2cups.
4. honey -1cup.... 


preparation:
1.Mix betel leaf juice, ginger juice, and sugar in a vessel keep on low flame, stir it till it becomes like honey in viscosity allow it to become warm and add honey.

expiry date: 3 - 6 months minimum.

Dose:
1. 2.5 -5ml 3-4 times in a day for cough and cold.
2. 2 - 3ml for loss of appetite and in indigestion.

for children:
1ml -2ml for 3-4 times in a day. or one drop per one kg of weight.

For children,for heat potency body people, in hot weather conditions dilute the syrup with equal quantity of water.

 
ఆనందం ఉద్వేగం ఆవేదన కసి ఒకేసారి సీమాంధరుల హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన మధుర క్షణం. పదేళ్ళ శ్రమ, చంద్రన్న మీద నమ్మకం, కార్యరూపం దాల్చిన వేళ . . రాజధాని లేకుండా ఎక్కడో నిర్ణయించకుండా ~~ ఆర్ధిక లోటుతో కూడా ఓ అధ్భుత రాష్ట్రంగా మలచాలన్న ఆశ ఆశయం పట్టుదల చూస్ కసి మరింత రగిలి పోతుంటే ఆనందం ఉద్వేగం. . . లక్షలాదిమంది అభిమానులు అతిరధ మహారధులు అధ్యాత్మిక గురుదేవులు మా గూరుజి శ్రీ శ్రీ ఆశీర్వాద బలం.... That's enough fr us 2 move forward wt dedication.

ఎరుక లేక స్పష్టత లేక ఎటు పోతున్నదీ నావ


హృదయం లోకి తొంగి చూడటం లేదు
హృదయం చెప్పేది ఆలకించటం లేదు
ఒకే ఒక క్షణం గమనం తో కన్ను మూసినా
హృదయ వాణి వినిపిస్తుంది ఇదే నీ మార్గమని
ఆ నిశబ్ధం చెప్తుంది నీ ఈ భాషను అలవర్చుకోమని
ఆ అనుభూతి అంటుంది ఇంతకు మించిన ఆనందం మరెక్కడా లేదని
ఆ మత్తు మొర పెడుతుంది ఇంతకు మించిన సౌఖ్యం మరెక్కడా లేదని
అందుకే నేను నిద్రకు తప్ప కళ్ళు వాల్చను
నా చుట్టూ జరిగే విన్యాసాలనే వీక్షిస్తా
నా చెవిలో పడే రణ గణ ధ్వనులనే వింటా
నా ఈ ప్రపంచపు వింత లనే అశ్వాదిస్తా
ఆశ పడతా కలలుకంటా ఆశయాలు ఏర్పరచుకుంటా
అవి నెరవేరేందుకు పావులు కదుపుతా
ఈ నా ప్రపంచపు మాయలో పడి
ఇదే అసలని ఇదే నిజమని ఇదే శాశ్వతమని
అనుకోక పోయినా ఇందులోనే కొట్టుకు పోతున్నా
ఎరుక లేక స్పష్టత లేక ఎటు పొతున్నదీ నావ

Sunday, 26 October 2014

అదరకు బెదరకు చెదరకు ఏ క్షణమయినా
ఎన్ని అడ్డంకులు ఎదురయినా 
మరెన్ని అవరోధాలు ఏర్పడినా
ప్రపంచమంతా ఒకటయ్యి పరిహాసించినా
నీ వాళ్ళంతా ఏకమయ్యి ప్రతిఘటించినా
నా రాత ఇంతేనని సర్ధుకు పోక 
తిరగరాయి తలరాతను ఇప్పటికయినా
సాధించు నీ లక్ష్యాన్ని ఇకనయినా
సాగిపో పట్టు సడలక గతి మరలక
నీవు నీవుగా . . ఎందరికో ఆదర్శంగా.
అందాల చిలకమ్మా
నీ పలుకు బంగారం
నీవందరికీ అపురూపం 
మరి ఒంటరినని దిగులెందుకమ్మా
చెరయ్యేనా నీబంగారు పంజరం
చేదయ్యెనా పంచభక్ష్యాలు 
చేదించు బంగారు ఉచలు
ఆస్వాదించు స్వేచ్ఛా వీచికలు
ఆలపించు స్వేచ్ఛా గీతికలు
లుషితం కలుషితం కలుషితం 
లోకమంతా కలుషితం
మనం తినే తిండి 
మనం త్రాగే నీరు
మనం పీల్చే గాలి
మన పల్లెలు మన పట్టణాలు
మన రాష్ట్రాలు మన దేశాలు
అంతటా కలుషితమే
మన ఆట మన పాట మన మాట
మన ఆలోచన విలోచన
అన్నీ కలుషితమే
కలుషితం కలుషితం కలుషితం
అని వ్యధ ఏల
లే నడుం బిగించి
పధం పట్టి కధం త్రొక్కి
మ్రోగించు యుద్దభేరి
కాలుష్యం లేని ప్రపంచం కోసం
స్వచ్చమైన సమాజం కోసం

నేను అల్పంలో అల్పాన్ని అనంతంలో అనంతాన్ని
నేను ఏమీ కాను కానీ విస్వమంతా నేనే
నేను గడ్డిపోచను అలాగే హిమగిరి శిఖరాన్ని
నేను ఏ ప్రత్యేకత లేని అతి సామాన్యురాలిని
అణువణువులో నిండి ఉన్న శక్తిని
నేను సూక్ష్మం లో సూక్ష్మాన్ని,అఖండంలో అఖండాన్ని