Sunday, 1 September 2013

Nadatha

ఏ మనిషికయినా మంచి చెడు విచక్షణ ఉండాలి
వేసే ప్రతి అడుగు పలికే ప్రతి పలుకు ఆచి తూచి వెయ్యాలి
తనకంటూ కొన్ని నమ్మకాలూ మరికొన్ని సిద్దాంతాలు ఉండాలి
తాను నమ్మినదానికి కట్టుబడి ఉండాలి విలువలకు బద్డులై ఉండాలి
ఒకరికోసం కాక తన కోసం తనే స్వీయ క్రమశిక్షణతో ఉండాలి
తన మాటలలో చేతలలో ఆదర్శంలో ఎందరికో మార్గదర్శీ అవ్వాలి
చేతనయితే తన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చెయ్యాలి
ఎదుటివారి లో ఉన్న లోపాలను పరిహాసించక పెద్ద మనస్సుతో సరీడిఢాలి
ఎదుటివారి తప్పులను సైతం జీర్ణించుకోగల స్థైర్యాన్ని అలవర్చుకోవాలి
ఇందుకు ఎంతో సాధన కావాలి అంతకు మించి పెద్ద మనస్సు కావాలి
నేనున్నట్టు లోకమంతా ఉండాలనుకోవటం న్యాయం కాదు
ఏ సమస్యానయిన మన దృస్తీ తో కాక ఎదుటివారి కోణంలో కూడా చూడగలగాలి
తప్పును ఒప్పు అనక్కర్లేదు తప్పు అని నేర్పుగా సున్నితంగా చెప్పాలి
వీలయితే ఎదుటివారిని సంస్కరించాలి చేతకకపోతే పక్కకు తప్పుకోవాలి
ప్రతి ఒక్కరీలోనూ మంచిని చూడగలగాలి అనుభవాలనుంది పాటాలు నేర్చుకోవాలి
మన హృదయం స్వచం ఉండాలి మన మనస్సు నిర్మలంగా ఉండాలి
ఎదుటివారు ఎలా ఉన్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్న తలంపు లేకుండా
ఎలాంటి పరిస్తితులు ఎదురయినా మనసారా నవ్వగలగలిగితే జీవితం దన్యం

No comments:

Post a Comment