Sunday, 26 October 2014


జీవితం . . .
ఓ మధుర స్వప్నం కొందరికి
ఓ జగన్నాటకం మరి కొందరికి
జీవితం . . .
పూలపాన్పు కొందరికి ముళ్ళపాన్పు మరి కొందరికి
అయినా ఎరుక లేక గమనం లేక మాయలో కొట్టుకుపోతున్న ఓ మనిషీ
నిన్ను నీవు మరిచి నీ దారి మరిచి నీ లక్ష్యాన్ని మరిచి
ఎటు పోతున్నావు నీ ఉనికిని మరిచి
ప్రశాంతంగా కూర్చో ఓ క్షణమయినా నీ పరుగు ఆపి
నీలోని ఆర్తిని వింటావు
నీ ఆత్మఘోషని తెలుసుకుంటావు

అభం శుభం తెలియని బాల్యం
కనిపించేదంతా యదార్ధమనిపించే కౌమారం
నాకే అన్నీ తెలుసు అనుకునే యవ్వనం
అనుభవ పాటాలతో తల పండిన వృద్దాప్యమ్
బాల్యం కౌమారం యవ్వనం వృద్దాప్యమ్
అన్ని దశలలోనూ నిర్లక్ష్యం చేశావు కదరా నీ లోని శక్తిని
గర్బస్థదశలో మొదలవ్వాల్సిన పయనం
విఘ్నేశ్వరుని పెళ్లి రేపు
అన్న చందాన పొస్ట్‌పోన్ చేసుకుంటూ
ఓ నాటికి ఈ లోకాన్నే వదిలితే
ఈ జన్మ వ్యర్ధమే కదా

లే, మేలుకో, నీ అంతర్వానిని విను
నీలోని నిన్ను దర్శించుకో
నిన్ను నీవు తెలుసుకో
అధ్యాత్మిక భౌతిక జీవనాలను సమన్వయం చేసుకో
ఆ జీవితం ఆ నిశబ్ధం
ఎంత సుందరంగా ఉంటుందో
ఎంత సూక్ష్మంగా ఉంటుందో
అస్సలయిన మాధుర్యం ఏమిటో
చెప్పటానికి మనస్సు పలకదు
మాట పెగలదు పెదవి కదలదు
ఈ హృదయం నుండి ఆ హృదయానికి మాత్రమే. .
తినే తిండి కలుషితం
తాగే నీరు కలుషితం
పీల్చే గాలి కలుషితం
తిండి కల్తీ
మనస్సులు కల్తీ
సమాజం కల్తీ
ఆ సమాజం లోనే నువ్వన్నావు నేనున్నాను
నీతోనూ నాతోనూ మన చుట్టూ ఉన్నవారితో
మొదలెట్టు నీ ప్రక్షాళన
వారిలా, వీరిలా, అన్న గోల నీకెందుకు
ముందు నిన్ను నీవు ఆత్మపరిశీలన చేసుకో
ఆది వారి స్వభావం
ఇది నా స్వభావమని తెలుసుకో
నేనే రైట్ అని విర్రవీగకు
వినయం సౌశీల్యమ్ మంచితనం మానవత్వం
స్పందించే హృదయాలను కల్తీ అని భ్రమపడకు
ముందు నిన్ను నీవు మనస్పూర్తిగా ప్రేమించటం మొదలెట్టు
అప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచం అందంగా కనిపిస్తుంది
ఎడారిలో కూడా బృందావనాన్ని చూడగలుగుతావు
కొందరిని కలిస్తే మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది
కొందరిని కలిస్తే విఘ్నానదాయకంగా ఉంటుంది
కొందరిని కలిస్తే స్నేహ సౌరాభాలు మన వెంటే వస్తాయి
కొందరిని కలిస్తే అత్మీయనురాగాలతో హృదయం ఉవ్విళ్ళూరుతుంది
కొందరిని కలిస్తే ప్రేమ పరిమళాలతో మళ్లీ ఎప్పుడెప్పుడు కలుద్దామా అనిపిస్తుంది
కొందరిని కలిస్తే కలవకుండా ఉంటే బాగుండేదే అనిపిస్తుంది
కొందరిని కలిస్తే మనస్సు గాయపడి వేదనకు గురౌతుంది
కొందరిని కలిస్తే వారి బాధల గాధలకు మనస్సు భారమౌతుంది
కొందరిని కలిస్తే వారి మాటల తూటాలకు ఎందుకు కలిశాం రా బాబు అనిపిస్తుంది
మరి మనని కలిసిన వారికి ఎలాంటి ఫీలింగ్ ఇద్దాం

కులం మతం ప్రాంతం, అంతం మన మతం
కులం మతం ప్రాంతం, కాదు మన అభిమతం
ప్రేమ మన గుణం దయ మన తత్వం
కరుణ మన గుణం శాంతం మన తత్వం
మానవత్వం మన మతం
ఐకమత్యమ్ మన అభిమతం
మమతసమతల కోవెల కావాలి మన సమాజం
సమాజం కావాలి మన దేవాలయం
V R 1 v r 1 & v r 1

తుమ్మెదోయమ్మ తుమ్మెదా
జోరు జోరున ఎగిరే తుమ్మెదా
బుర్రంతా తొలిచేసావే తుమ్మెదా

నీ ధర్మం పరుగయితే
పరిగెత్తె నీ వేగాన్ని గమనిస్తా
విహరించటం నీ హాబీ అయితే
ఎరుకతో నీ సొగస్సును గమనిస్తా

తుమ్మెదోయమ్మ తుమ్మెదా
జోరు జోరున ఎగిరే తుమ్మెదా
బుర్రంతా తొలిచేసావే తుమ్మెదా

నీ పనిలో నువ్వుంటే నీ వెంటే నేనుంటా
నీతో పరుగూ తియ్యను నీతో కొట్టుకూ పోను
నీ సొగస్సును నీ వేగాన్నీ నీ నత్తనడకలను చూస్తూ
నీ రాక పోకలను గమనిస్తూ

తుమ్మెదోయమ్మ తుమ్మెదా
జోరు జోరున ఎగిరే తుమ్మెదా
బుర్రంతా తొలిచేసావే తుమ్మెదా

ఎరుకతో గమనించి గమనించి
నీ ఉనికి కోల్పోవటాన్ని వీక్షిస్తూ
ఆ మౌన తరంగాలను ఆశ్వాధిస్తూ
ఆనందలోకాల్లో తేలిపోతూ
పరామర్శిస్తాను నన్ను నేను
ఎలా ఉన్నావ్ ఎక్కడ ఉన్నావ్ అంటూ
ఆలింగనం చేస్తూ ఐక్యమయిపొతా నాలోని నాతో
ఈ లోకాన్నంతా మరిచి . .

నేనో మామూలు మనిషిని
నిజాయితీ నా భూషణం
నిరాడంబరత నా ఆభరణం
నాలో ఏ ప్రత్యేకత లేకపోయినా
నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలన్న తహతహ
ఆది జన్మతా వచ్చిందో పెరిగిన వాతావరణమొ తెలియదు
కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి గమనిస్తూనే ఉన్నా
వయస్సుకి మించిన పరిపక్వత వలనేమో
చిన్నతనం నుండి నా కంటూ ఓ అస్తిత్వాన్ని కోరుకుంటాను
మూస పోసినట్టు నులుగురిలో నారాయాణ కాక
నా భావాలు నా ఆలోచనలు నా అభిప్రాయాలు
ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయి అంటారు
నేనేం చేసినా ఆది వంటయినా వార్పయినా నా ముద్ర ఉండాల్సిందే
అందుకే నాకు నా వ్యక్తిత్వమంటే ఇష్టం
లోపాలుంటే సరి చేసుకుంటాను
తెలియకపోతే నేర్చుకోవడానికి సిగ్గు పడను
నాకు తెలిసింది అందరికీ చెప్పటానికి ఎప్పుడూ సిద్దమే
కదలండి కదలండి జడత్వాన్ని వదిలి కదలండి
ఆపన్న హస్తం అందించటానికి కదలండి
మేమున్నామంటూ ధైర్యం చెప్పండి
మేమున్నామంటూ భరోసా ఇవ్వండి
రెక్కలు వక్కలయ్యిన విహంగంలా
బోసిపొయ్యి బోరుమంటున్నది అందాల విశాఖ
హద్ హద్ సృష్టించిన బీభత్సంతో 
అల్లాడుతున్న బాధితులను ఆదుకునేందుకు
కదలండి కదలండి జడత్వాన్ని వదిలి కదలండి